calender_icon.png 22 October, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాలకు కేరాఫ్‌గా జోగుళాంబ క్షేత్రం

22-10-2025 01:28:22 AM

- గతంలో ఆలయ ఈవో, అర్చకుల తీరుపై దేవాదాయ శాఖ సీరియస్ 

- అదే పంథాలోనే ప్రస్తుత ఆలయ ఇంచార్జీ ఈవో తీరు! 

 అలంపూర్ అక్టోబర్ 21: తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్య క్షేత్రం అయిదవ శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం మళ్ళీ వి వాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. రెండు నెలల క్రితమే ఆలయ ఈవో, అర్చకు లు దేవాదాయ ధర్మదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యక్రమంలో పా ల్గొన్నారన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు అప్పటి ఆలయ ఈవో , అర్చకులపై చర్య లు తీసుకుంది.

ఆలయ ఈవోను బదిలీ చే స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చకులకు మెమోలు జారీ చేసింది.ఈ క్రమంలో ఆలయానికి నూతన ఈవోగా దీప్తి రెడ్డి బాధ్య తలు చేపట్టారు.అయితే ఈవో పనితీరు ఆ మె వ్యవహార శైలీపై స్థానికుల మధ్య ,రాజకీయ వర్గాల్లో.. టెండర్ దారుల మధ్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ఈవో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆమె వ్యవహార శైలి, ఏకపక్ష నిర్ణయాలు, తనకు సోదరులుగా చె ప్పుకునే విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా అన్ని వ్యవహారాలు నిర్వహించడం వంటి చర్యలు వివా దాస్పదంగా మారాయి.ఆలయంలో అధికారక హోదా లేని ఆ వ్యక్తికి ఈవో వివిధ పను ల్లో పెత్తనం ఇస్తూ ..సదరు వ్యక్తి ఆధిపత్యం ధోరణిలో వ్యవహరిస్తున్నట్టు సిబ్బంది, టెం డర్ దారులు ఆరోపిస్తున్నారు. అతనే టెండ ర్ ప్రక్రియలు, సప్లై కాంట్రాక్టులు, పూల అలంకరణలు, కూరగాయల సరఫరా వెల్డిం గ్ పనులు, రహదారి మరమ్మత్తు వంటి అ నేక అంశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాడ ని అతనే కీలకంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

దళిత మహిళపై వివక్ష

స్థానిక దళిత మహిళ సరళ కూరగాయల సరఫరా టెండర్లు తక్కువ కొటేషన్తో ఎంపికైనప్పటికీ చివరికి ఆమెను పక్కనపెట్టి విష్ణువ ర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కర్నూలు నుండి కూరగాయలు తెప్పించారని ఆమె కుటుంబం తెలి పింది. టెండర్ రద్దు అయినప్పటికీ సరళ చె ల్లించిన రూ.10,000 డిపాజిట్ ఇంకా తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరళ భర్త సుంకన్న ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారం కాబట్టే టెండర్ రాలేదని తీ్ర వ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఈఓకు అన్నగా చెప్పుకునే విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారంపై ప్రశ్నించిన సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని ఈవో దీప్తి రెడ్డి మెమోలు ఇస్తూ బెదిరింపులు పాల్పడుతున్నట్లు తీవ్ర చర్చ జరుగుతుంది.

ఆలయ టెండర్లలో అస్పష్టత

ఆలయ ప్రాంగణంలో వాహన పార్కింగ్ చీరల సేకరణ తాత్కాలికపనుల వంటి పలు టెండర్లు కూడా అస్పష్టత ఉందని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. వాహన పార్కింగ్ వద్ద ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా టికెట్లు ప్రింట్ చే యించి రుసుము వసూలు చేయించడం మరో వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోం ది. ఈవో అధికార దుర్వినియోగం ఏకపక్ష నిర్ణయాలు సిబ్బందిపై ఒత్తిడి వంటి అంశాలపై స్థానికులు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించి ప్రతి రూపాయి ఖర్చు ఆదాయ వివరాలు పాలకమండలి అనుమతి తీసుకోకుండానే ఖర్చు చేశారా అన్నటువంటి అను పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.