22-10-2025 01:26:40 AM
- ముందు వరుసలోకి అధికార పార్టీ లీడర్లు.
- మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖలకు ముడుపులు.!?
- అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు.
- వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు స్వాహా
నాగర్ కర్నూల్ అక్టోబర్ 21 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ భూములు ఖాళీ స్థలాలపై భూ బకాసురులు మళ్లీ పంజా విసురుతున్నారు. గత పదేళ్ళ కా లంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ అండదండలతో అందిన కాడికి అడ్డగోలుగా కబ్జా చేసి అ క్రమ నిర్మాణాలు చేపట్టిన రియల్ వ్యాపారులు తాజాగా అధికార పార్టీ లీడర్లతో అంట కాగుతూ మిగిలిన ప్రభుత్వ భూ ములు, చెరువులు కుంటలు శిఖం భూములను ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు స మాయత్తమయ్యారు. ప్రధాన రహదారులకు ఆనుకొని వందల కోట్ల విలువచేసే ప్ర భుత్వ భూముల పక్కనే తక్కువ స్థలంలో పట్టా భూములను కొనుగోలు చేసి బై నెం బర్ల సహాయంతో ప్రభుత్వ భూములను అ మాంతం మింగేస్తున్నారు.
అధికార పార్టీ ముఖ్య నేతల వద్ద నమ్మిన బంటులుగా పే రొంది తెర వెనుక మాత్రం ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ, మైనింగ్ ఇరిగేషన్ వంటి శాఖ అధికారులతో చేతులు కలిపి స్థలాన్ని బట్టి ముడుపులు ము ట్ట చెబుతున్నట్లు బాహాటంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తమ పరి ధి కాదంటూ తప్పించుకొని ఉన్నతాధికారులకు సైతం తప్పుడు నివేదికలు సమర్పిస్తు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితం గా సెలవు రోజుల్లో, పండగ దినాల్లో సమ యం చూసి రాత్రికి రాత్రే కబ్జారాయిళ్ళు ని ర్మాణాలు చేపడుతున్నారు.
వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు స్వాహా..!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యా పారుల చేతిలోనే మగ్గుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రధాన చెరువులు కుంట లు శిఖం భూములతో పాటు నాళాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గత బిఆర్‌ఎస్ అధికార పార్టీ లీడర్లు కబ్జా చేసి విలాసవంతమైన అక్రమ భవనాలు నిర్మించుకున్నారు. వీటన్నింటి విలువ వేల కోట్లల్లో ఉంటుందని ప్రభుత్వ అధికారులు అంచనా.
అయినా వాటిని విడిపించాల్సిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు సైతం వాటి వైపు కన్నెత్తి చూడకపో వడంతో పలు విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. అలసత్వమా, అవివేకమా.. లేదా వారి తో అంట కాగుతున్నారా అన్న అనుమానా లు సర్వత్ర చర్చకు దారితీస్తున్నాయి. వాటిని విడిపించకపోగా ప్రస్తుతం కోట్ల విలువజేసే మరికొన్ని జాగాలు కబ్జాకు గురికావడంతో ప్రజల్లో అధికార పార్టీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తివ్యక్తమవుతోంది.