calender_icon.png 23 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కేవలం చదువులపైనే దృష్టి సారించాలి

23-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి ,జనవరి 22 (విజయక్రాంతి) వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో పీవీ రంగారావు జూనియర్ కళాశాలలో వంగర ఎస్త్స్ర దివ్య మాట్లాడుతు యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, ఆడ పిల్లలు సోషల్ మీడియా కి దూరంగ వుండాలని, మొదటిగా చదువుపై దృష్టి పెట్టాలని, సైబర్ మోసాల బారిన పడవద్దని, రోడ్డు ప్రమాదాలు,డయల్100,షీ టీమ్స్, బాల్య వివాహాలు,

ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, భరోసా, గురించి వివరిస్తు, మీ తల్లితండ్రులు చెప్పిన మాట వినాలని, సైబర్ మోసాలకు గురైతే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయాలని తెలిపారు. పలు సామాజిక అంశాలపై పోలీస్ జాగృతి కళా బృందం వారు ఆలపించిన పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసాయి. 

ఈ కార్యక్రమానికి వంగర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆఫ్రిన్,అధ్యాపక బృందం, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ ,కళా బృందం ఇంచార్జి ఉమెన్ ఏ ఎస్ ఐ నాగమణి , సభ్యులు,హెడ్ కానిస్టేబుల్స్, విలియమ్,వెంకటేశ్వర్లు, రత్నయ్య, పూల్ సింగ్, హోమ్ గారడ్స్ ఇతరులు, మొత్తం 250 మంది పాల్గొన్నారు.