calender_icon.png 24 January, 2026 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

24-01-2026 07:54:20 PM

జైనూర్(విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సోఫియా నాజ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ... విద్యా సంవత్సరం 2026-27 కుగాను 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల లో 9వ తరగతి వరకు తరగతులు ఈ సంవత్సరంలో అందుబాటులో ఉన్నాయని పడవ తరగతిపై తరగతిలో ఖాళీ సీట్లలో కూడా భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ఉచితంగా ఇంగ్లీష్ మీడియం లో విద్య అందించడం జరుగుతుందన్నారు. అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో tgmreistelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని, లేదా నేరుగా పాఠశాలలో సంప్రదించవచ్చు తెలిపారు. మరిన్ని వివరాల కోసం పాఠశాల ప్రిన్సిపాల్ కు 9154238157 నంబర్ పై సంప్రదించవచ్చని ప్రకటించారు.