09-10-2025 09:03:35 PM
మల్యాల (విజయక్రాంతి): పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ వీరలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాల కార్యక్రమాల వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల పట్ల శ్రద్ధ వహించాలని, పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ,డా,బి.నరేష్, మల్యాల ఎస్సై నరేష్, ఏసిడిపివో అరవింద, ఐసిడిఎస్ సూపర్వైజర్ పవిత్ర, శారద, మహేశ్వరి, సుభద్ర, ఉమా సుధారాణి, జ్యోతి జానకి, పి హెచ్ సి ఎంవో రమణమ్మ, డిఎంసి అశ్విని, హేమ, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది, తల్లులు పిల్లలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.