calender_icon.png 24 January, 2026 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

24-01-2026 09:17:19 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని 62వ డివిజన్ కు చెందిన పూరెల్ల సరోజ-మధు దంపతులు తమ అనుచరులతో పాటు 36,27 డివిజన్లకు చెందిన వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరినారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై బిఆర్ఎస్, బిజెపి పార్టీలను వీడి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్,  నాయకులు ఎండి తాజ్, మల్లికార్జున రాజేందర్, శ్రావణ్ నాయక్, మూల రవీందర్ రెడ్డి, అబ్దుల్ రెహమాన్, చర్ల పద్మ, ఉప్పరి విశాల్, కమ్రుద్దీన్ పాల్గొన్నారు.