calender_icon.png 5 December, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి

05-12-2025 09:54:00 PM

మంథని,(విజయక్రాంతి): స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయుటకు నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులు మంథని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కావలసిన నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి, పెద్ద ఎత్తున సమకూరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.  కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న అభ్యర్థుల వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ నాయకులపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని గోటికార్ కిషన్ జీ తెలిపారు.