07-09-2025 12:16:42 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): సీనియర్ జర్నలిస్టు కట్ట కవితకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం ఉప్పల్ సమీపంలో యాక్సిడెంట్‌లో కవిత గాయపడ్డారు. కవితకు గాంధీ హాస్పిటల్‌ల్లో వైద్యు లు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఆమె కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం సూచించారు.