calender_icon.png 7 September, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..

07-09-2025 12:15:31 AM

అధ్వానంగా తయారైన రోడ్ల నిర్మాణం పై పట్టింపేది 

అభివృద్ధి కోసమే పార్టీ మారానన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు

భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు వైపల్యం 

రూ. 100 కోట్లు కేటాయించాలని 

ఎర్రజెండా నాయకత్వంలో పాదయాత్ర

యాత్రను ప్రారంభించిన సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి

వెంకటాపురం(నూగూరు): ప్రజా సమస్యలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు పట్టింపేలేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, పులి జిల్లా సిపిఎం కార్యదర్శి బీరెడ్డి సాంబశివలు విమర్శించారు. వెంకటాపురం ప్రజలు ఓట్లు వేయకుండానే ఆయన గెలిచారా అని, ఎమ్మెల్యే వైఫల్యం కారణంగానే అధ్వానంగా తయారైన భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారి పరమత్తులకు నిధులు తేలేకపోతున్నారని ఆరోపించారు. దుర్భరంగా తయారైన భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారి నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించాలని సిపిఐ ఎం) పార్టీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్రను చేపట్టింది.

ఈ పాదయాత్రను యాకన్న గూడెం వద్ద సిపిఐ (ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూడి కృష్ణారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఆ పార్టీలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు తేవడం కష్టంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. అధికార పార్టీలో చేరిన ఆయన ఏజెన్సీ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. యాకన్నగూడెం నుండి వెంకటాపురం వరకు రోడ్డు మీటర్ కు నాలుగు గుంతలు ఏర్పడి అద్వానంగా తయారైందన్నారు.

నెలలుగా భద్రాచలం నుండి వెంకటాపురం ఆర్టీసీ బస్సులను సైతం నిలిపివేస్తే ఆయన ఏం చేశారని అన్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు. యాకన్నగూడెం నుండి వెంకటాపురం వరకు ఎక్కడ ఎక్కిన, ఎక్కడ దిగిన ఆటోవాలాలు ప్రయాణికుల వద్ద నుంచి రూ 80 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బడులు మానేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వెంకటాపురం ప్రజలు ఓట్లు వేయకుండానే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారా అని దుయ్యబట్టారు. కనీసం ప్రజల అవసరాలకు ఉపయోగపడే రోడ్డు నిర్మాణంలో ఇంత వైఫల్యం ఎందుకని ప్రశ్నించారు.

ఒక్కొక్క లారీ నుండి రూ. 1340 రోడ్ టాక్స్ పేరుతో ప్రభుత్వం వారి వద్ద నుండి నిధులు సేకరిస్తున్నారు. అయినా అధ్వానంగా తయారైన రోడ్డుపై వారికి పట్టింపు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఏజెన్సీ సంపదను దోచుకుంటున్న ప్రభుత్వం ఇసుక ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ప్రజల అవసరాల మేరకు ఉపయోగపడే రోడ్డు నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయిస్తేనే రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు. నిర్మాణానికి నిధులు కేటాయించేదాకా ఎర్రజెండా నాయకత్వంలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.