24-01-2026 02:21:39 PM
మేడ్చల్ అర్బన్, జనవరి 24 (విజయక్రాంతి): కూలీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 1800 200 100 12 టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకు వచ్చిందని తెలిపారు. కూలీలు ఈ నంబర్ కు ఫోన్ చేస్తే వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. యాజమాన్యం వేతనాలు చెల్లించకపోయినా, కనీస వసతులు కల్పించక పోయిన, ఇతర బెనిఫిట్స్ ఇవ్వకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. అసంఘటిత కూలీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.