calender_icon.png 24 January, 2026 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ యాప్ రద్దుచేసి.. యూరియా కొరత తీర్చాలి

24-01-2026 02:37:06 PM

మండల కేంద్రంలో రాష్ట్ర నిర్వహించిన సిపిఐ నాయకులు

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం

మునుగోడు,(విజయక్రాంతి): యూరియా ఆన్లైన్ యాప్ రద్దుచేసి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించి  స్థానిక తాసిల్దార్ కు మెమోరాండం అందజేసి మాట్లాడారు మాట్లాడారు.యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వర్ సమస్యలతో యూరియాను సరి అయిన సమయంలో పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం గతం మాదిరిగానే సొసైటీల ద్వారా, ఫర్టిలైజర్ షాపులలో యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రస్తుతం వరి నాట్లు అయిపోయి నేల కావస్తున్న యూరియా అందుబాటులో లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇప్పటికైనా యూరియాను ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ,బండమీది యాదయ్య,మందుల పాండు, చాపల శ్రీను,సురిగి చలపతి బిలాలు,సతీష్ , ఈదులకంటి కైలాస్, దుబ్బ వెంకన్న, ముంత నరసింహ, బైరుగొండ వెంకన్న, కురుమర్తి ముత్తయ్య, బి నరసింహ ,నందిపాటి అశోక్ ,జి నరసింహ,  సత్యనారాయణ ,కట్టలాలు ,జి నరేందర్,ఉదయ్ కుమార్,కట్కూరి లింగస్వామి,మిర్యాల యాదయ్య, బి కిరణ్ ఉన్నారు.