24-01-2026 02:20:20 PM
జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్వేత ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, గర్భనిర్ధారణ పరీక్షలు, ఎద సూదులు, దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దీన రాజలింగం హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం పశువులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గోపాల మిత్రలు కనుకయ్య,గౌరయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.