calender_icon.png 24 January, 2026 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచర్లలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం

24-01-2026 02:13:54 PM

భిక్కనూర్, జనవరి 24(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల అరుణస్వామి, ఉపసర్పంచ్ ఆశ రమేష్, వార్డు సభ్యులు పోలు నరేందర్, కర్రోళ్ల సిద్ధయ్య, పోలు మహేందర్, పోలు స్వప శ్రీను, చిన్నోళ్ల రవి, కొత్తొల్ల లక్ష్మి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిగౌడ్‌తో పాటు నాయకులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లత మాట్లాడుతూ బాలికల విద్య, సాధికారతకు సమాజం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గ్రామ పాలకవర్గం సభ్యులను పాఠశాల సిబ్బంది శాలువాలతో సత్కరించారు.