calender_icon.png 24 January, 2026 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ గేటు సమీపంలో చిరుత సంచారం

24-01-2026 02:23:32 PM

ఎఫ్ఆర్వో వాసుదేవ్ సిబ్బందితో కలిసి తనిఖీ

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ అడవి రేంజి పరిధిలోని తాండూర్ గేటు సమీపంలో చిరుత పులి సంచరించినట్లు స్థానిక ప్రజలు సమాచారం అందించడంతో అట్టి సమాచారం మేరకు రేంజ్ సిబ్బందితో కలిసి ఆప్రాంతానికి వెళ్లి తనిఖీ చేసినట్లు నాగిరెడ్డిపేట్ రేంజ్ ఫారెస్ట్ ఎఫ్ఆర్వో వాసుదేవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో వాసుదేవ్ మాట్లాడుతూ...తాండూర్ గేటు సమీపంలో చిరుతపులి సంచరించిన ప్రాంతంలో చిరుత పులి పాద ముద్రలు,మల విసర్జన కనబడినట్లు తెలిపారు.

తాండూర్ అడవి ప్రాంతంలో చిరుత పులి ఉన్నట్లు కచ్చితంగా నిర్ధారణ చేయడమైందనీ ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ తెలిపారు.అందువల్ల అటవీ ప్రాంత సమీపంలో గల తాండూర్,ధర్మారెడ్డి,బంజారా తండా మరియు లింగంపల్లి  గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగలరని సూచించారు.రైతులు సాయంత్రం ఐదు గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా పంట పొలాల వద్దకు వెళ్లవద్దని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రవికుమార్,బీట్ ఆఫీసర్ నవీన్,గోపాల్ పాల్గొన్నారు.