calender_icon.png 24 January, 2026 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో 26న ఉచిత కంటి వైద్య శిబిరం

24-01-2026 02:15:14 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిలోని పెన్షనర్స్ భవనంలో ఈనెల 26న సోమవారం మెడివిజన్ కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్స్ సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్షలు నిర్వహించబడతాయని, హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయబడుతుందని, పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.