24-01-2026 12:00:00 AM
వర్షం వచ్చిన ఎండకొట్టిన ప్రయాణికులకు తప్పని తిప్పలు
కోనరావుపేట జనవరి ౨౩(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనరావు పేట మండలం ప్రయాణికుల సౌకర్యార్థం లక్షలాది రూపాయలు వెచ్చించి కోనరావుపే ట మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బ స్టాండ్ అలంకార ప్రాయంగా దర్శనమిస్తోం ది. ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బ స్టాండ్ వెలవెల బోతుంది. దీంతో బస్టాండ్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంది.
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో కోనరావుపేటలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో వున్నప్పుడు ఆర్టీసీ బస్టాండ్ నిర్మించి ప్రారంభించారు.కానీ బస్టాండ్ నిర్వహణలో సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను ప్ర యాణ ప్రాంగణం వద్ద ఆపకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్ ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇతర కార్యకలాపాలకు వినియోగం
ప్రయాణ ప్రాంగణం ఏరియా వినియోగంలో లేకపోవడంతో పంచాయితీ లకు, పానీపూరి బండికి, టిఫిన్ సెంటర్ కు అడ్డా గా మారింది. అంతే కాకుండా ఆటోలకు పా ర్కింగ్ గా మారింది బస్టాండ్ లోకి బస్సులు రాక పోవడంతో ప్రయాణికులతో పాటు కళాశాలలకు, పాఠ శాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు కోసం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డు పైనే ఎండాలో,
వానలో వేచి ఉండా ల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ప్రయాణికులు,గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సంబంధిత ఆర్టీసీ సంస్థ, అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని బస్టాం డ్ ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.