calender_icon.png 17 January, 2026 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్ నాయక్‌తో దోస్తీ కటీఫ్

17-01-2026 12:46:38 AM

కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఆప్తులు

కేసముద్రం, జనవరి 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కు అత్యంత ఆప్తులుగా చెప్పుకునే కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ నీ లం సుహసిని దుర్గేష్, మహబూబాబాద్ ఆత్మ మాజీ చైర్మన్ పోలేపల్లి నెహ్రు (శ్రీనివాస్) రెడ్డి ఇప్పుడు శంకర్ నాయక్ తో దోస్తికి కటీఫ్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం నీలం దుర్గేష్ శం కర్ నాయక్ తో దోస్తానా విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక తరహాలో ఆత్మ మాజీ చైర్మన్ నెహ్రూ రెడ్డి సైతం నాలుగు రోజుల క్రితం శంకర్ నాయక్ తో దోస్తీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెం ట్ లో కేసముద్రం మండలానికి చెందిన ఈ ఇద్దరు నేతలు శంకర్ నాయక్ కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందారు.

నీలం దుర్గేష్ కొద్దికాలం క్రితం రక్షణ శాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ చేసి శంకర్ నాయక్ నేతృత్వంలో బీఆ ర్‌ఎస్‌లో చేరారు. కొద్దికాలంలోనే ఆయన శంకర్ నాయక్ అత్యంత ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకొని, కేసముద్రం మార్కెట్ చైర్మన్ పదవి బిసి మహిళకు కేటాయించగా తన సతీమణి సుహాసినికి ఇప్పించేలా చక్రం తిప్పారు. అలాగే నీలం దుర్గేష్ కేసముద్రం మండల పార్టీకి అన్ని తానై పెద్దదిక్కుగా నిలిచారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన రెండేళ్ల కాలం పాటు కూడా దుర్గేష్ శంకర్ నాయక్ వెన్నంటే ఉన్నారు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఆయన శంకర్ నాయక్ దోస్తానా విడిచిపెట్టారు.

దోస్తానా విడిచిపెట్టడంతో పాటు ఏకంగా బీఆర్‌ఎస్ పార్టీకి కూడా రామ్ రామ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనం సృష్టించింది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న దుర్గేష్ పార్టీ నుండి వెళ్లిపోవడంతో కేసముద్రం బిఆర్‌ఎస్ కొంత డిస్టర్బ్ కాగా, తాజాగా శంకర్ నాయక్ ఆప్తుడిగా పేరు ఉన్న మరో నేత పోలేపల్లి నెహ్రూ రెడ్డి శంకర్ నాయక్ తో దోస్తీ కటీఫ్ చేసుకొని ఆయన కూడా బీఆర్‌ఎస్ కు రామ్ రామ్ చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసము ద్రం (వి)కి చెందిన ఇద్దరూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అత్యంత ఆప్తులుగా కొనసాగారు.

ఇప్పుడు వీరిద్దరూ శంకర్ నాయక్ తో దోస్తానా విడిచిపెట్టడంతోపాటు బీఆర్‌ఎస్ పా ర్టీనీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అటు శంకర్ నా యక్, ఇటు బీ ఆర్ ఎస్ పార్టీకి పెద్ద లోటుగా పేర్కొంటున్నా రు. దుర్గేష్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా పనిచేస్తూ ఆ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గంలో కొంత పట్టు సంపాదించారు. అటు దుర్గేష్, ఇటు నెహ్రూ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని విడిచిపెట్టడంతో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కేస ముద్రం మున్సిపాలిటీలో బీఆర్ ఎస్ కు పెద్ద లోటుగా పేర్కొంటున్నారు. 

ఎందుకు దోస్తానా ఖరీఫ్ చేసినట్టు..?

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సన్నిహిత సహచరులు, అ త్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన దుర్గేష్, నెహ్రు రెడ్డి ఉన్నట్టుండి ఆయనతో దోస్తీ కటీఫ్ చేయడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలుగా ప్రచారం సాగుతోంది. శంకర్ నాయక్ తో ఈ ఇద్దరు నేతలు కూడా ఆర్థికపరమైన అంశాల్లో దోస్తీ ఉండేదని, శంకర్ నాయక్ అధికారంలో ఉన్నప్పుడు అనేక తెర వెను క ఆర్థిక లావాదేవీల్లో వీరిద్దరూ ‘బినామీ’లుగా ఉండేవారని ప్రచారం అప్పట్లో జోరుగా సాగేది.

అయితే ఇటీవల శంకర్ నాయక్ తో ‘ఆర్థిక’ అంశాల్లో విభేదాలు తలెత్తడంతో ఆయన తో దోస్తానాకు తెగ తెంపులు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనతో తలెత్తిన ఆర్థిక విభేదాలను పరిష్కరించే అంశాన్ని బిఆర్‌ఎస్ హై కమాండ్ తో పాటు జిల్లా నేతల దృ ష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇందులో వేలు పెట్టేందుకు ససేమీరా అనడంతో చేసేదేమి లేక చివరకు ఆ ఇద్దరు నేతలు దోస్తానా వదులుకోవడంతోపాటు పార్టీని కూడా వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారం సాగుతోంది.

మరికొందరు ఎడ మొఖం పెడ ముఖం

ఇదిలా ఉంటే కేసముద్రం మండలానికి చెందిన పలువురు బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సైతం శంకర్ నాయక్ తో సఖ్యత లేక ఏడ మొఖం పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. కేసముద్రం మం డల పార్టీలో పార్టీ పటిష్టత కోసం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం, త్వరలో నిర్వ హించే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కో సం కొందరు నేతలు ప్రతిపాదించిన ప్రతిపాదనలను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టించుకోవడంలేదని, అంతా తానే అన్నట్లు వ్యవహరించడం వల్ల కొందరు నేతలు దూరం దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది.