26-12-2025 05:19:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజన్న జెండాను ఎగురవేశారు. పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ పార్టీ పేదల కోసం అనేక ఉద్యమాలను నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు గంగామణి రామ్ లక్ష్మణ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.