06-11-2025 06:52:50 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుల దురహంకార హత్యకు గురైన తలండి శ్రావణి(రాణి) కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులు గురువారం తాహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దహెగాం మండలం గెర్రె గ్రామంలో ఆదివాసీ మహిళ తలండి శ్రావణి ఈ నెల 18వ తేదీన కుల దురహంకార హత్యకు అయిందని తెలిపారు.
అతి కిరాతకంగా చంపిన శ్రావణి మామ శివార్ల సత్తయ్య, కుటుంబ సభ్యులు శివార్ల కుమార్, శివార్ల కవితలపై అట్రాసిటీ కేనుతో పాటు జీవిత ఖైదు విధించాలని, సత్తయ్యకు ఉన్న ప్రభుత్వ భూమిని శ్రావణి కుటుంబానికి ఇప్పించాలని, ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని మిమ్మల్ని కోరారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం దినకర్ KVPS జిల్లా కార్యదర్శి, ఆత్మకూరీ చిరంజీవి AIYF జిల్లా కార్యదర్శి, గొడిసెల కార్తీక్ DYFI జిల్లా కార్యదర్శి, జె.రాజేందర్ CITU జిల్లా అధ్యక్షులు జగజంపుల తిరుపతి PDSU జిల్లా కార్యదర్శి, బోగే ఉపేందర్. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.