calender_icon.png 6 November, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తాం

06-11-2025 06:50:20 PM

జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్..

కల్వకుర్తి: కల్వకుర్తి పురపాలక పరిధిలోని సంజాపూర్ లో జరిగిన హత్యాయత్నం సంఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. గురువారం సంఘటనా స్థలాన్ని కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం సంజాపూర్ కు చెందిన మల్లేష్ వెల్దండ మండలం చెరుకూరుకు చెందిన శిరీషతో వివాహం జరిగిందని, అయిన ప్పటికీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం ఇంట్లో తెలియడంతో అతనిపై భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇరువురిని కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగిందన్నారు.

అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో మూడు నెలల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నాడు. దీంతో అతని భార్య శిరీష పేరున భూమి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అది పూర్తిగా చేయకపోవడంతో ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే బుధవారం శిరీష సోదరులు అతని మిత్రులు మొత్తం ఆరు మంది మల్లేష్ వ్యవసాయ పొలం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న  అతని తల్లి అలివేలు, తండ్రి జంగయ్య తమ్ముడు పరమేష్ ఉండటంతో వారితో గొడవపడి గొడ్డలి కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గాడికి పాల్పడ్డ ఆరు మందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఘటనపై  దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి ఉన్నారు.