06-11-2025 06:57:45 PM
సుల్తానాబాద్ లో కార్తీక అఖండ జ్యోతి యాత్ర..
సాంబశివ దేవాలయంలో పూజలు... అభిషేకాలు..
ఐదు సంవత్సరాలు గా జ్వాలాతోరణం వేడుకలు...
నేటితో ముగిసిన నగర సంకీర్తన....
పూజారి పారువెల్ల రమేష్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులు
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివ దేవాలయం లో కార్తిక అఖండ దీపం అంగరంగ వైభవం గా జరిగింది, కార్తీక మాసానికి 15 రోజుల ముందు నుండే కోజా గారి పౌర్ణమి నుండి ఆలయంలో అఖండ జ్యోతి కార్యక్రమం ప్రారంభమై నెల రోజులపాటు కొనసాగింది, నేడు గురువారం తో నగర సంకీర్తన ముగిసింది, 40 సంవత్సరాల నుండి కార్తీక జ్యోతి యాత్ర సుల్తానాబాద్ పట్టణంలో జరగడం విశేషం, ప్రతి రోజు సాంబశివ దేవాలయంలో తెల్లవారుజామున అభిషేకాలు పూర్తవుతాయి.
ఐదు గంటలకు ఆలయ పూజారి పారువెల్ల రమేష్ శర్మ , కుమారుడు సాయి ప్రణవ్ శర్మ లు భక్తులందరితో కలిసి కార్తీక జ్యోతిని వెంట తీసుకొని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి పాత జెండా మీదుగా పాత బజార్లోని శివాలయం, హనుమాన్ ఆలయాలను సందర్శించి పోలీస్ స్టేషన్ మీదుగా సాంబశివ ఆలయం కు చేరుకుంటుంది, అఖండ జ్యోతి నగర సంకీర్తనలు భాగంగా ఇండ్ల నుండి దంపతులు జ్యోతి కి స్వాగతం పలుకుతూ వత్తులు వేసుకుంటారు.. దారి పొడవునా భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేసుకుంటూ ఈ నగర సంకీర్తన కొనసాగుతుంది, నగర సంకీర్తన అనంతరం సాంబ సాంబశివ దేవాలయం లో కార్తీక పురాణ శ్రవణం జరుగుతుంది, ఆలయానికి చేరుకున్న భక్తులకు నెలరోజులపాటు ప్రతిరోజు ఒక పురాణం వైభవాన్ని రమేష్ శర్మ భక్తులకు వివరించారు ...
నాలుగు దశాబ్దాల నుండి కార్తీక అఖండ జ్యోతి యాత్ర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది...
పూజారి పారువెల్ల రమేష్ శర్మ....
40 సంవత్సరాల నుండి కార్తీక అఖండ జ్యోతి యాత్ర , సాంబశివ దేవాలయంలో అఖండ దీపోత్సవం.... అభిషేకాలు... ప్రత్యేక పూజలు చేయడం .... భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం... నాకు ఎంతగానో సంతోషంగా ఉంటుందని పూజారి పారువెళ్ల రమేష్ శర్మ తెలిపారు. కార్తీక జ్యోతి యాత్ర ఈ సంవత్సరంతో 40 సంవత్సరాలు కావడం విశేషం, అఖండ జ్యోతితో నగర సంకీర్తన జరగడం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది, ఈ అఖండ జ్యోతితో నగర సంకీర్తన కార్యక్రమం జరపడంతో గ్రామ క్షేమం కోసం... ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం.... రైతులు పాడిపంటలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని... జ్యోతి యాత్ర ప్రారంభించడం జరిగింది అన్నారు...
అశ్వియుజ పౌర్ణమి నుండి కార్తిక పౌర్ణమి వరకు ఈ నగర సంకీర్తన కొనసాగించడం జరిగిందన్నారు... అలాగే ఐదు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.... ఇప్పుడు వచ్చే సోమవారం సాంబశివ దేవాలయం లో దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పారువెల్ల రమేష్ శర్మ కోరారు.... ఈ అఖండ జ్యోతి యాత్రలో పూజారి రమేష్ శర్మ కళ్యాణి దంపతులతో పాటు వారి కుమారుడు సాయి ప్రణవ్, కూతురు వైష్ణవి ఈ వేడుకల్లో పాల్గొన్నారు... ఈ నగర సంకీర్తన విజయవంతం కు సహకరించిన నా అసిస్టెంట్ బండి రామ్మోహన్ తో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా పూజారి పారువెల్ల రమేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు...