07-11-2025 06:38:11 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కుషన్న రాజన్న
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని CPM పార్టీ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను కోరారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కుషన రాజన్న మాట్లాడుతూ... శ్రావణి హత్య జరిగి 20 రోజులు అవుతున్నప్పటికీ ఆమె కుటుంబాన్ని జిల్లా అధికారులు ఇప్పటి వరకు పరామర్శించలేదన్నారు. వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఎకరాల భూమి, 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్.జిల్లా కమిటీ సభ్యులు ముంజం.ఆనంద్ కుమార్. గేడం.టికానంద్ పాల్గొన్నారు.