07-11-2025 07:28:20 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కోతుల బెడదను తగ్గించేందుకుగాను మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టింది, సుల్తానాబాద్ పట్టణంలో ఇటీవల కోతులు దాడులు చేయడం వల్ల పలువురు గాయలకు గురయ్యారు. కాగా కోతులు ఇండ్లలోకి చొరబడి నష్టానికి గురి చేస్తున్నాయి. దీంతో కోతులు పట్టడంలో అనుభవం ఉన్న ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల నుండి కోతులు పట్టే పనిని ప్రారంభించడం జరిగింది. కోతుల బాధలు తొలగిపోతే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు.