07-11-2025 08:17:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): నవంబర్ 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా, కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. స్పెషల్ లోక్ అదాలత్ లో మైనర్ కేసులు, అంతగా తీవ్రం కానీ లా అండ్ ఆర్డర్ కేసులు, క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ ప్రజల చిన్నచిన్న కేసులు, పెండింగ్ వారెంట్లు, లీగల్ సర్వీసులతో సంబంధిత అంశాలు వేగంగా పరిష్కారమవ్వడం ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం అందించడం లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో కేసుల పరిశీలన పూర్తి చేసి, లోక్ అదాలత్‌కు సంబంధించిన వివరాలను సంబంధిత కక్షిదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.