07-11-2025 06:27:16 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో శుక్రవారం S.G.F U/14, U/17 బాలురు, బాలికల నెట్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి మొత్తం 80 మంది విద్యార్థులు ఈ ఎంపిక పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలు మొత్తం 24 మంది విద్యార్థులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి (DYSO) అశ్వక్ అహ్మద్, ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, నెట్ బాల్ జిల్లా అధ్యక్షుడు ఆలీ బిన్ అహ్మద్, సీనియర్ ఉపాధ్యాయులు ఎం. మల్లేష్, శ్రీ వర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయులు బి. తిరుపతి, సి.హెచ్. యోగి, రాకేష్, ప్రణీత్, సౌందర్య, వాణి తదితరులు పాల్గొన్నారు.