calender_icon.png 7 November, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

07-11-2025 07:30:29 PM

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

తలమడుగు,(విజయక్రాంతి): చట్టలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మండల ఎస్సై రాధిక  అన్నారు. శుక్రవారం మండలంలోని సాయి లింగీ కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన  కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై రాధిక మాట్లాడుతూ... ప్రస్తుత స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల  సైబర్ నేరగాలి ఎక్కువ అయ్యారని, అలాంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతే కాకుండా ఆడపిల్లలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు భయపడకుండా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఆడపిల్లలు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  కేజీబీ ప్రిన్సిపాల్ అర్చన, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.