calender_icon.png 7 November, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో ఘనంగా వందేమాతరం గీతాలాపన

07-11-2025 06:44:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఘనంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గీతం 'వందేమాతరం' గీతం రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక  ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో  సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ... వందేమాతర గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర  పోషించిందని 1950 వ సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ దీనిని భారత జాతీయ గీతంగా స్వీకరించిందని అన్నారు. ఈ గేయం భారతీయులలో దేశభక్తిని,ఐక్యతా భావాన్ని రగిలించి స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. ఉద్యమకారులకు ఇది ఒక ప్రధాన ప్రేరణగా నిలిచిందని, వారిలో విప్లవ స్ఫూర్తిని నింపి, అహింసాయుత పోరాటానికి సిద్ధం చేసిందన్నారు. జాతీయ గీతం చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.