calender_icon.png 7 November, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మౌలాలి రైల్వే స్టేషన్ కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

07-11-2025 07:36:34 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మౌలాలి రైల్వే స్టేషన్ కు బహుజన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని తన వ్యక్తిగత కార్యలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కోండ కోటపై బడుగుల జెండా ఎగురువేయాలనే దిశగా సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్థానం ప్రారంభించాడని, గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ను రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు.

ఇక్కడి నుండి ప్రారంభమైన ఒకోక్క మెట్టు ఎక్కుతూ దాదాపు 12వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కోండ కోటను స్వాధీన పర్చుకొని 7 నెలల పాటు పాలన సాగించాడని, మొగులాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది పాపన్ననే అని తెలిపాడు. మహారాష్ట్రలో ముస్లీం పాలన అంతానికి ఛత్రపతి శివాజీ ఎలా పోరాటం చేశాడో తెలంగాణలో ముస్లీం పాలన అంతానికి మొగులు చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి, ఛత్రపతి శివాజీకి సమకాలికుడిగా పాపన్న గౌడ్ నిలిచాడని కొనియాడారు. ఇంత చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును మౌలాలి రైల్వే స్టేషన్ కు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయనున్నట్లు గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ తెలిపారు.