calender_icon.png 7 November, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు

07-11-2025 07:24:12 PM

డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అన్నారు.శుక్రవారం తన  నివాసం వద్ద ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మంజూరులో, నిర్మాణ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం ఉండదని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిల్లులు వస్తాయని పనులను త్వరగా ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు.