07-11-2025 07:33:41 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని టీ ఎన్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి, ఐటీ లో తెలంగాణ లో విస్తరణపై చర్చించినట్లు వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగ దాయకంగా ఉన్నాయని అంబులెన్స్ కోవిడ్ లో సేవలు, రైతులు విద్యుత్ సరఫరా, విద్యార్థులకు కంప్యూటర్స్ ల్యాబ్స్ అందించటం లాంటి బహుముఖ సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వర రావు ని కేటీఆర్ అభినందించారు, అని ట్రస్ట్ మెంబెర్ ఇనుగంటి రాము తెలియ చేశారు.