07-11-2025 08:13:55 PM
పెద్ద సార్లు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి
లైన్మెన్ సయ్యద్ గఫర్ ఆవేదన
కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆపరేషన్ ఏఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ లైన్మెన్ తన ఆవేదన ను వ్యక్తం చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందిని కావడంతో తన ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసులో, చుక్క పూర్ గ్రామంలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ గఫర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే సయ్యద్ గఫర్ కు 2013లో కుడికాలు విరిగి ఆపరేషన్ జరిగినది. మాచరెడ్డి మండలంలో సెక్షన్ ఆఫీస్ లో పనిచేస్తూ చుక్క పూర్,ఎల్లార్ పల్లి (లక్ష్మి రాజుల పల్లి) రెండు గ్రామాలలో లైన్మెన్ గా ఒక సంవత్సరము నుండి విధులు నిర్వహిస్తున్నప్పటికీ నాకు ఫోన్ లేదని ఆపరేషన్ ఏ ఈ తనకు మూడుసార్లు మేమో ఇస్తూ అప్ స్టాండింగ్ చూపిస్తున్నార అని లైన్మెన్ గఫర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ లో ఆఫీసర్ ఏఈ తిరుపతి ప్రతి నెల నా యొక్క జీతము కట్ చేయించడం జరుగుతుందన్నారు. కిందిస్థాయి సిబ్బంది ఎలా చెబితే అలా ప్రవర్తిస్తున్నారు.
ఆగస్టు నెలలో సబ్ స్టేషన్ డ్యూటీ సోమారిపేట్ సబ్ స్టేషన్ లో డ్యూటీ చేయించుకున్నారు. తిరిగి మళ్లీ ఫీల్డ్ పైకి రమ్మని చెప్పారు. దానితో అక్టోబర్ నెలలో నేను విధులకు హాజరయ్యేందుకు సెక్షన్ ఆఫీసుకు వెళ్లాను. నన్ను స్తంభాలు ఎక్కి డ్యూటీ చేయాలని లేకపోతే డ్యూటీకి రావద్దని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు,నా కుడి కాలు మోకాలు విరిగినది ఆపరేషన్ చేసి రాడ్లు వేసినారు. కరెంటు స్తంభాలు ఎక్కడము నాతోని కాదు అని చెప్పిన పట్టించుకోవడం లేదు. కనీసం నా బాధ అర్థం చేసుకోకుండా నన్ను ఆపరేషన్ ఏఈ తిరుపతి ఇష్టం వచ్చినట్లుగా బూతు మాటలు మాట్లాడుతూ నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని నీవు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని నన్ను బెదిరిస్తూ ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేస్తున్నారు.
ఆపరేషన్ ఏఈ తిరుపతి తిట్టే మాటల పైన విరక్తి పుట్టి నేను నా యొక్క విధులకు హాజరు కాలేకపోతున్నాను.కావున నాయందు దయ తలచి పై అధికారులు నాకు వేరే గ్రామానికి సబ్ స్టేషన్ డ్యూటీ మార్చగలరని నాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నదా అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని లైన్మెన్ గఫార్ కోరారు.