calender_icon.png 7 November, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం మనందరికీ స్ఫూర్తి మంత్రం: ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి

07-11-2025 08:27:25 PM

చేగుంట: వందేమాతర గేయం భారతీయులు అందరికీ స్ఫూర్తి మంత్రమని ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సామూహిక గేయాలాపనలో ఎస్ఐ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం గేయం భారతీయులను ఏకం చేస్తూ, బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి ఆయుధంగా మారిందని అన్నారు. మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ, మహనీయుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.