calender_icon.png 7 July, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తొలి ఏకాదశి పండుగ

06-07-2025 07:21:57 PM

కోదాడ: పట్టణంలోని విష్ణుబోట్ల హరి ప్రసాద్ శర్మ నివాసంలో త్రిశక్తి శాంభవి పీఠం వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోదాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సుభిక్షంగా పాడిపంటలతో అందరూ ఈ తొలి ఏకాదశి పండుగకు పిల్లల నూతన విద్యాభ్యాసం మంచిగా సాగి, అందరు కూడా ప్రశాంతంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు కుటుంబ సభ్యులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.