calender_icon.png 7 July, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారుల జాగ్రత్త..!

06-07-2025 07:43:07 PM

వసుళ్ళ పేరుతో మోసం చేస్తే సహించం..

బాధితులకు న్యాయం చేస్తాం..

విద్యుత్ శాఖ ఇంచార్జి ఏడి ఉమారావు..

మణుగూరు (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, మెరుగైన సేవలను అందించడమే తమ శాఖ ప్రధాన లక్ష్యమని, విద్యుత్ శాఖ ఇంచార్జి ఏడి బియ్యని ఉమారావు స్పష్టం చేశారు. అశ్వాపురం మండలంలో విద్యుత్ శాఖపై గత రెండు రోజులుగా పత్రికలలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల వద్ద నుండి ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేశారని, తమ శాఖ అధికారుల పర్యవేక్షణతో విషయం నిర్ధారణ అయ్యిందన్నారు. ఇందుకు సంబంధించి  స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

ఉన్నత అధికారుల ఆదేశాలతో స్పష్టమైన ఎంక్వయిరీ చేయించి, ప్రైవేట్ కాంట్రాక్టర్ రాముపై క్రిమినల్ కేసు నమోదు చేపించి, శాఖ పరమైన కఠిన చర్యలు చేపడతామన్నారు. బాధితుల దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారనేది స్పష్టంగా ఆధారాలతో సహా సేకరించి, న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం డివిజన్ వ్యాప్తంగా ఆయన పేరు మీద ఉన్న కాంట్రాక్ట్ లను రద్దు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆయనకు విద్యుత్ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆ కాంట్రాక్టర్ ద్వారా మోసపోయిన ఓ బాధితురాలుకు వెంటనే న్యాయం చేశామన్నారు. వినియోగదారులకు ఎలాంటి విద్యుత్తు కనెక్షన్  కావాలంటే వెంటనే మీ సేవ ద్వారా డీడీలు కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు.

విద్యుత్ ఉద్యోగులను డబ్బులు ఇవ్వవద్దని, ఇకమీదట ఎవరైనా విద్యుత్ కలెక్షన్ పేరుతో డబ్బులు వసూలు చేసిన విద్యుత్ శాఖ బాధ్యత వహించదన్నారు. మోసపోయిన బాధితులు ఎవరైనా ధైర్యంగా తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చునని, సమాచారాన్ని అందించాలని కోరారు. లేదా అధికారులను ఈ క్రింది నెంబర్ల ద్వారా ఏడి 8712486074, ఏఈ  8712486086 ఫోర్ మెన్  8712486087 సంప్రదించాలన్నారు. లిఖితపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అధికారులు మీ వద్దకే వచ్చి విచారణ జరుపుతారని, నిర్ధారణ జరిగితే శాఖపరంగా కఠినమైన చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా లోటు రానిచ్చే పరిస్థితి లేదని, ప్రజల సహకారంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రజామోద యోగ్యమైన కరెంటును 24 గంటల పాటు అవసరమైన మేరకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.