calender_icon.png 7 July, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ ఐక్యత, దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ

06-07-2025 07:19:10 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): జాతీయ ఐక్యత, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడిన మహానేత, భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ, జనసంగ్  వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర కొనియాడారు. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ 133, 134 పోలింగ్ బూత్ అధ్యక్షులు జంగపల్లి వినయ్, చిందం అంజి ల ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా  నిర్వహించారు. ఇట్టి వేడుకలకు ముఖ్యఅతిథి   హాజరైన బొంతల  కళ్యాణ్ చంద్ర  ముందుగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి కాలనీ చౌరస్తా, పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణ వద్ద  11 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జంగపల్లి వినయ్, చిందం అంజి, బండి స్వరాజ్ పాల్గొన్నారు.