06-07-2025 07:04:01 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఇటీవల మరణించిన పాల్వంచ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్ రావు కుటుంబ సభ్యులను ఆదివారం రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy)లు పరామర్శించారు. గట్టాయిగూడెంలోని మనోహర్ నివాసంలో చిత్రపటానికి పొంగులేటి, రఘురాం రెడ్డిలు నివాళులర్పించారు. ఆయన సతీమణి జయలక్ష్మి, కుమారుడు పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐడిసి చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య, పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి నాగ సీతారాములు, డిసిసిబి డైరెక్టర్ బొర్రా రాజశేఖర్, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, తూము చౌదరి, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, వై వెంకటేశ్వర్లు, పులి సత్యనారాయణ,కాపర్తి వెంకటాచారి, చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, కాపా శ్రీను, చింతా నాగరాజు, వాసుమల్ల సుందర్ రావు, డాక్టర్ పృద్వి, జగన్నాథం అజిత్, రమేష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.