06-07-2025 07:37:53 PM
హుజూర్ నగర్/పాలకీడు: పాలకీడు నూతన ఎస్‌ఐగా రవ్వ కోటేష్(SI Ravva Kotesh) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2014 బ్యాచ్ కు చెందిన ఎస్‌ఐ కోటేష్ 317 జీవో ద్వారా నల్లగొండ జిల్లాకు బదిలీపై వచ్చారు. మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐతో పాటు షీటీం ఇంచార్జీగా విధులు నిర్వహించిన అనంతరం దేవరకొండకు బదిలీపై వెళ్లారు. అక్కడ నుండి నేరేడుగోమ్ము ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ ప్రస్తుతం నేరేడుగోమ్ము నుండి పాలకీడు మండల ఎస్సైగా బదిలీపై వచ్చారు. తాను ఎక్కడ పనిచేసిన తన మార్కును చూపిస్తూ, సమర్థవంతమైన అధికారిగా ఇటు ఉన్నతాధికారుల నుండి అలాగే ప్రజల నుండి అభినందనలు పొందుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు పాలకీడు ఎస్సైగా విధులు నిర్వహించిన లక్ష్మీనరసయ్య భువనగిరి టౌన్ కు బదిలీపై వెళ్లారు. ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన కోటేష్ ను పలువురు అభినందనలు తెలిపారు.