calender_icon.png 7 July, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం చేతిలో ఉంది అని ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోము..!

06-07-2025 06:42:23 PM

వక్ఫ్ భూమిలో వేస్తున్న రోడ్డు పనులను నిలిపివేయాలి..

కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అధికారం చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోమని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వక్ఫ్ భూమి లోంచి లతీఫ్ సాబ్ గుట్ట పైకి 20 కోట్ల రూపాయల వ్యయంతో వేస్తున్న బీటీ రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. లతీఫ్ సాబ్ గుట్ట పైకి రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్ నిబంధనలు పాటించలేదని వారు ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్ భూమి గుండా రోడ్డు పనులు చేపడుతున్నారని చెప్పారు. పనులను నిలిపివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy), కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా సంబంధిత అధికారులను రోడ్డు నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని వారు ప్రశ్నించారు. మరోవైపు మంత్రి వెంకట్ రెడ్డికి ప్రధాన అనుచరులైన కొంతమంది వారు చేసిన వెంచర్ లో వక్ఫ్ భూమిని ఆక్రమించారని ఆరోపించారు. వక్ఫ్ భూమిలో కట్టిన వాటర్ ట్యాంకును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వక్ఫ్ భూమి లో వేస్తున్న రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని, మంచినీటి ట్యాంకును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సయ్యద్ మౌలానా ఎహసాజోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్, ఎంఏ హఫీజ్ ఖాన్, జియావుద్దీన్ బాబా, మాజీ కౌన్సిలర్లు సయ్యద్, ఇబ్రహీం, న్యాయవాది మసూద్ అలీ, జిలాని తదితరులు పాల్గొన్నారు.