calender_icon.png 7 July, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మొహర్రం వేడుకలు

06-07-2025 07:11:06 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో మొహర్రం(Muharram) ఆదివారం ఘనంగా ముగిశాయి. మండలంలోని బోడు, తావుర్యాతండా, టేకులపల్లితో పాటు తదితర గ్రామాల్లో పీర్ల పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుల మతాలకతీతంగా ఈ వేడుకలను జరిపారు. మొహర్రం నెల ప్రారంభంలో పీరీలను ఆశూర్ ఖానాలో కూర్చోబెట్టి పది రోజుల పాటు ఆశుర్ ఖానా వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేసి తెలంగాణ యాసలో చుట్టూ తిరుగుతూ పాటలను పాడారు. పదవరోజు పీరిలాను ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి సాయంత్రం చెరువుల వద్దకు నీటి బావుల వద్దకు తీసుకెళ్లి శాంతింప జేశారు.

గ్రామాల్లో వివిధ వేషధారణలు వేసి ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు భారీ ఎత్తున హాజరై పీరీలకు కుడుకలు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గత పది రోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారంతో మొహరం వేడుకలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో బోడులో భూక్యా సైదులు, టేకులపల్లిలో మూడ్ బిచ్చు, మూడ్ రమణ, మూడ్ రమేష్, మూడ్ రాజ్ కుమార్, మూడ్ గణేష్, మూడ్ కృష్ణ, గుగులోత్ నాగేశ్వరావు, హుస్సేన్, సైదులు, రమేష్, లోకేష్, శేఖర్, చందు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.