20-11-2025 11:25:21 AM
విజయవాడ: మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Madvi Hidma) మృతదేహం ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. రంపచోడవరం(Rampachodavaram) ఆస్పత్రిలో బుధవారం రాత్రి హిడ్మా మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. హిడ్మా, అతని భార్య రాజే మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగించారు. అర్ధరాత్రి 12 గంటలకు బందోబస్తు మధ్య హిడ్మా మృతదేహం ఛత్తీస్‌గఢ్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. హిడ్మా మృతితో ఛత్తీస్‌గఢ్ లోని సుక్మాజిల్లా పువ్వుర్తి(Sukma district Puvarti village) గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. హిడ్మా మృతదేహం చూసి హిడ్మా తల్లి పుంజి, ఆదివాసీలు బోరున విలపిస్తున్నారు.
మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, రంపచోడవరం ఆస్పత్రిలో(Rampachodavaram Hospital) మావోయిస్టుల మృతదేహాలకు(Maoists Bodies) పోస్టుమార్టం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మావోయిస్టుల మృతదేహాలను వైద్యులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఏపీలోని రంపచోడవరం ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు వేచిఉన్నారు. అల్లూరి జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. రంపచోడవరం ఆస్పత్రిలో 11 మంది మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.