calender_icon.png 18 November, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయ ఉద్యోగి ప్రేమ్‌కు కళాసేవ పురస్కారం

16-08-2024 12:40:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): తెలంగాణ సచివాలయ ఉద్యోగి జరుస్లావత్ ప్రేమ్‌ను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ యామిని స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో కళా సేవ పురస్కారం సత్కరించారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ చేతులమీదుగా ప్రేమ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తూనే, మరోవైపు హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిటీ ద్వారా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఈ సత్కారానికి ఎంపిక చేశారు.