16-08-2024 12:40:46 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి గురువారం వెళ్లారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ముగియగానే శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు చేరుకుని హస్తినకు బయలుదేరారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. శుక్రవారం ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సబంధంచిన పలు అంశాలపై పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.
అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం ఉదయమే రాష్ట్రానికి వచ్చిన సీఎం ఒక్క రోజు వ్యవధిలోనే ఢిల్లీకి వెళ్లడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కొత్త పీసీసీ అధ్యక్షుడు, పార్టీ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. పదవుల పంపకంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.