16-08-2024 12:37:59 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): కెనరా బ్యాంక్ దక్షిణ ప్రాంతీయ కార్యాలయం అబిడ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద గురువారం పీర్జాదిగూడ జెడ్పీహెచ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ కార్యాలయం డీజీఎం కృష్ణకాంత్‌రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.