06-08-2025 01:39:42 AM
హెచ్‌సీయూ ప్రొఫెసర్ కే.లక్ష్మీనారాయణ
ముషీరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): సల్లూరి మల్లేష్(నేతకాని) కుల దురంకార హత్యకు ప్రధాన కారకుడు దమ్మన్నపేట మొల్కూరి చంద్రయ్యను మొదటి ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్ట్ చేయాలని హెచ్ సీయూ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అలిండియా ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగ గోవిందు, ప్రొ.వెంకటదాసు మారేడు, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు, రచయిత ఇంద్రవెల్లి రమేష్‌లు డిమాండ్ చేశారు.
మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్య సంఘటనలో నిజా నిజాలను తెలుసుకోవడానికి జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం, కిషన్ రావు పేట గ్రామానికి నిజనిర్ధారణ కమిటీగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. బాధితుని తల్లిదండ్రులు, భూదవ్వ, రాజయ్యలు వారి బంధువుల నుండి సేకరించినట్లు తెలిపారు.
సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న నిందితులందరి కాల్ డేటా ను బయట పెట్టాలన్నారు. బాధితుడు సల్లూ రి మల్లేష్‌ను నిందితునిగా, నిందితులు నైనా ల రాజిరెడ్డి, మల్లారెడ్డి లను బాధితులుగా రివర్స్ చేయడానికి సహాయ సహకారాలు అందించిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలన్నారు.
సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్యలో ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న హరీష్, ఇతర నిం దితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్న జగిత్యాల డి.ఎస్.పి.ని నేర విచారణ అధికారి బాధ్యతనుండి తప్పించి, నిజాయితీగల అధికారిని నియమించాలని మేము డిమాండ్ చేశారు. బాధితుడు సల్లూరి మల్లేష్ ను ఆర్థికంగా అణిచివేసి, తన నుండి రూ.20 లక్షల ప్రత్యక్షంగా దోచుకున్న నైనాల రాజిరెడ్డి, మల్లా రెడ్డిల ఆస్తిని జప్తు చేయాలన్నారు. దళిత బాధితులకు రూ.1 కోటి నష్టపరిహారన్ని ప్రభుత్వం వెంటనే అందజేయాలన్నారు.