23 April, 2026 | 5:11 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

కాళేశ్వర ఆదాయం 2.83 కోట్లు

29-05-2025 12:00 AM

-పుష్కరాలతో సహా 64 రోజులకు లెక్కింపు

కాళేశ్వరం(మహబూబాబాద్), మే 28 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయ హుండీ ఆదాయన్ని బుధవారం లెక్కించారు.

12 రోజుల పాటు నిర్వహించిన సరస్వతీ పుష్కరాలతో సహా 64 రోజులకు రూ.2.83 కోట్లు వచ్చిన ట్టు ఆలయ ఈవో ఎస్ మహేష్, దేవాదా య శాఖ సహాయ కమిషనర్ ఆర్ సునిత తెలిపారు. హుండీ ద్వారా రూ.1,36,28, 099 ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1,38,36, 552, గదుల అద్దె ద్వారా రూ.1.71 లక్షలు, హోమాల ద్వారా రూ.1.23 లక్షలు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ.5.60 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. 

అలాగే 15 గ్రాము ల మిశ్రమ బంగారం, 1.75 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సూపరిండెంట్ బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.