calender_icon.png 5 November, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళింగ ఫస్ట్‌లుక్ విడుదల

10-07-2024 12:05:00 AM

ధృవ వాయు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధిం చిన టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలయ్యాయి. ప్రఖ్యాత రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి చిత్ర బృందానికి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడుకాలం నరేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, సమ్మెట గాంధీ, బలగం సుధాకర్  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విష్ణు శేఖర, అనంత నారాయణన్, ఎడిటర్: నరేశ్ వేణువంక.