calender_icon.png 22 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక బల్దియా, పరిషత్‌లపై ఫోకస్

22-12-2025 12:22:37 AM

రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలటీలు ఇక్కడే

కరీంనగర్, డిసెంబర్21(విజయక్రాంతి): పంచాయతీ జోష్తో జనవరిలోనే మునిసిపల్, పరిషత్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు 2 నగరపాలక సంస్థలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో కరింనగర్ నగరపాలక సంస్థ, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీ లు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీ లు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కో రుట్ల, మెటపల్లి, ధర్మపురి, రాయికల్ , రాజ న్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఉమ్మడి జిల్లా పరిధిలో ఇన్నిలేవు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 60 జడ్పీటీసీ, 1646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కరీంనగర్ జడ్పీ టీసీలు 15, ఎంపీటీసీలు 170 , జగిత్యాల జడ్పీటీసీలు 20,ఎంపీటీసీలు 216,పెద్దపల్లి జిల్లాలో జడ్పీటీసీలు 13,ఎంపీటీసీలు 137, రాజన్న సిరిసిల్లలో జడ్పీటీసీలు 12,ఎంపీటీసీలు 123లు ఉన్నాయి.పంచాయతీ ఎన్నిక ల్లో ఎక్కువ సీట్లు దక్కించుకొని ఉత్సాహం గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు పట్టణాల దిశగా అడుగులు వేస్తోంది.

గ్రామాల్లో గెలుపు సాధించిన తర్వాత, పట్టణాల్లోనూ ప్రజాదరణ ఉందని చూపించేందుకు జనవరిలోనే మునిసిపల్ ఎన్నికలు పెట్టే ఆలోచ నలో ఉంది. ఎన్నికల ముందున్న ప్రధాన అంశం బీసీ రిజర్వేషన్లు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినా, మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని కోర్టు స్పష్టం చేయడంతో జీవో 9 నిలిచిపోయింది. దీంతో, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్లు ఆగిపోయాయి.

ఆ నిధులు రాబట్టుకోవాలంటే ఎన్నికలు జరగాలి కాబట్టి, ప్రభు త్వం పాత రిజర్వేషన్ విధానానికే అనుమతి ఇచ్చింది. మునిసిపల్ మరియు పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి. అందుకే, బీసీలకు ఎలాంటి సీట్ల కేటాయిం పు ఇవ్వాలి, ఎలా పోటీ చెయ్యాలి అన్నదిపై కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోంది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.

పార్టీ వర్గాల అంచనా ప్రకారంముందుగా మునిసిపల్ ఎన్నికలు, తర్వాత పరిషత్ ఎన్నికలు జరపాలని ప్రభు త్వం భావిస్తోంది.గ్రామాల్లో సాధించిన విజయం, పట్టణాల్లో కూడా కొనసాగించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.. అయితే పరిషత్ ఎన్నికలకు ముందు పోతేనే బెటర్ అని కొందరు సూచిస్తుండటం తో మంత్రివర్గ సమావేశం కీలకం కానుంది.