calender_icon.png 22 December, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల మంజూరుకు అభ్యర్థన

22-12-2025 12:28:47 AM

అర్మూర్, డిసెంబర్21 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర పంచయత్ రాజ్ ,గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కి మరో మారు వినతి పత్రం ఇచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పంచయత్ రాజ్ రోడ్లు, వంతెన పునర్నిర్మాణం- పనుల మంజూరు కోసం అభ్యర్థన. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పంచయత్ రాజ్ డిపార్ట్మెంట్ రోడ్లు గ్రామానికి మరో గ్రామానికి రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ,రోడ్లు బాగా లేనందున ప్రజలు ఇబ్బందులవుతు ప్రమాదాలు కావడం లో లెవల్ వంతెన వలన వర్షాకాలం రహదారులు చెడిపోవడం,మునిగి పోవడం వలన ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

రోడ్ల విస్తరణ .ఆలూర్ మండలం గుత్ప ,కల్లేడి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కోసం 2 కోట్ల 50 లక్షల  రూపాయలు నిధుల కోసం.మాక్లూర్ మండలం  మెట్టు ,గొట్టిముక్కలను కలుపుతూ లాక్మపూర్ వరకు సుమారు 1.6 కిలోమీటర్ ల రోడ్డు కోసం 1కోట్ల 52 లక్షల  రూపాయలు నిధుల కోసం.మాక్లూర్ మండల కేంద్రం,మాక్లూర్ ఎస్సి  కాలనీ నుండి ముల్లంగి వరకు సుమారు 1.5 కిలోమీటర్ల రోడ్డు కోసం 1కోట్ల 42 లక్షల 50 వేల  రూపాయలు నిధులు కోసం ఆర్మూర్ మండలం మంథాని గ్రామం నుండి సుమారు రామ్ పూర్ వరకు 4.95 కిలోమీటర్ల  రోడ్డుకు 4 కోట్ల 70 లక్షల,25వేల రూపాయలు నిధుల కోసం డొంకేశ్వర్ మండలం మారంపల్లి ఆర్ అండ్ బి రోడ్ నుండి డొంకేశ్వర్ పి ఆర్ రోడ్డువరకు బైపాస్ సుమారు 3.70 కిలోమీటర్ల రోడ్డును 3కోట్ల 51 లక్షల 50 వేల రూపాయలను నిధుల కోసం. నందిపేట్ మండలం ఖుద్వంపూర్ గ్రామంలో నందిపేట్ మెయిన్ రోడ్డు నుండి ఎల్లమ్మ మందిరం వరకు ఘాట్ రోడ్డు నిర్మాణం కొరకు సుమారు 1.5 కిలోమీటర్ల కోసం 1కోటి 42 లక్షల 50 రూపాయల నిధులు కోసం పైన పేర్కొన్న రహదారులను, వంతెనలు ఆమోదం తెలిపలని మంత్రి దనసరి సీతక్క కు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  వినతి  పత్రం ఇవ్వడం జరిగింది.