22-12-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచ పట్టణంలో గల డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయంలో దొంగలు పడ్డారు? మైనింగ్ విద్యార్థులు సర్వేకు ఉ పయోగించే పరికరాలు (తెడియోలైట్) ల్యాబుల్లో భద్రపరుస్తుంటారు. మైనింగ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో సర్వే పరికరాలు మా యం అయినట్లు ల్యాబ్ ఇన్చార్జి గుర్తించినట్టు తెలుస్తోంది.
వెంటనే తెడియోలైట్స్ దొంగలించిన అంశాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రిన్స్ పాలకొల్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగి ఎనిమిది నెలల అయినప్పటికీ నేటికీ పరికరాల మా యంపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ సంఘటన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 27న సర్వే పరికరాల ల్యాబ్ కు సీల్ వేయడం జరిగింది. దీంతో సీలు వేశారు విచారణ మరి చారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స ర్వేకు ఉపయోగించే తిదియో లైట్స్ 8 నుంచి 10 వరకు కనిపించట్లేదు అన్నట్టు తెలుస్తోంది.
మైనింగ్ కాలేజ్ ఏర్పాటు సమయం లో సరఫరా చేసిన విలువైన పరికరా లు దొంగిలించబడిన యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయం. వీటితోపాటు స మీపంలోని రేకుల షెడ్డులో గల స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పరికరాలు, ల్యాబ్ లోని మరికొన్ని పరికరాలు సైతం మటుమాయం అ యినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయంలో దొంగిలించబడిన పరికరా లపై విచారణ చేపట్టి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాం డ్ చేస్తున్నారు.
ఈ విషయమై విశ్వవిద్యాల యం ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజును వివరణ కోరగా ఈ సంఘటన గత విద్యా సంవ త్సరం ఆఖరి రోజుల్లో జరిగిందని, దానిపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశామన్నారు. తాజాగా ఎలాంటి దొంగతనాలు చోటు చేసుకోలేదని, ఏమైనా జరిగినట్లు వెల్లడైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో ల్యాబ్ కు వేసిన సీల్ ఇప్పటివరకు ఓపెన్ చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.