calender_icon.png 24 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి

24-08-2025 12:00:00 AM

బీసీ కులాల ఐక్యవేదిక డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కామా రెడ్డి డిక్లరేషన్ లోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అమలు చేయాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల పేర్లతో ఇటు తిప్పి అటు తిప్పి 42 శాతం రిజర్వేషన్ ను అటకెక్కించే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుందన్నారు. ఇంతకంటే జఠలమైన ఈడబ్ల్యూఎస్ ను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని అమలు చేయటం పెద్ద విషయం కాదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డిని నియమించడం పట్ల ప్రభుత్వానికి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తేలిపోయిందని అన్నారు. ప్రభుత్వానికి బీసీ అభ్యర్థి దొరకకపోవడం శోచనీయం అన్నారు. ఈ సమావేశంలో సం ధ్యారాణి, కాశీనాథ్ ముదిరాజ్, విజయ్, మ హేంద్ర, జే.అరుణ్ కుమార్, దుర్గాప్రసాద్, నర్సింహులు ముదిరాజ్, లోకపల్లి భీమేష్, రమేష్, ఎం.ఆంజనేయులు, ఇ.సురేందర్, వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.